Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

"ఐ లవ్ యూ" చెప్పే ముందు ఇలా చేయండి..?

Advertiesment
, శనివారం, 2 మార్చి 2019 (16:46 IST)
కాలేజీ క్యాంపస్‌లో అడుగిడిన వెంటనే అబ్బాయిలందరి చూపు అమ్మాయిలపైనే ఉంటుంది. అమ్మాయిలకు హాయ్ చెప్పి స్నేహితులగా చేసుకునేందుకు ఉవ్విళ్లూరుతుంటారు. ఇందుకోసం సదరు అమ్మాయి యొక్క ఇష్టాయిష్టాలను తెలుసుకుని ఆ ప్రకారం ఆమెతో చెలిమి చేయడానికి యత్నిస్తుంటారు. 
 
ఈ ప్రయత్నంలో కొందరు సఫలీకృతమవుతారు.. మరికొందరు బోల్తా పడతారు. సక్సస్ అయినవారిలో కొందరు ప్రేమికులుగా మారుతారు. అయినప్పటికీ ఈ ప్రేమలు చాలామందిలో ఒన్ సైడ్‌గా సాగుతుంటాయి. ప్రేమించిన విషయాన్ని ఒకరికొకరు చెప్పుకోవడంలో అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు. 
 
ముఖ్యంగా అబ్బాయిల పరిస్థితే గందరగోళంగా ఉంటుంది. తమ ప్రేమ విషయాన్ని అమ్మాయిలకు ఎలా చెప్పాలో తెలియక డీలా పడుతుంటారు. అటువంటి వారికోసం కొన్ని చిట్కాలు.
 
మీరు ప్రేమించిన అమ్మాయికి మీ మనసులోని ప్రేమ భావాన్ని వ్యక్తీకరించే ముందు.. అదేనండీ "ఐ లవ్ యూ" చెప్పేముందు, ఆమె కళ్లను పరీక్షగా చూడండి. ప్రశాంతంగా ఉంటే మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. లేదంటే అప్పటికి మీ నిర్ణయాన్ని వాయిదా వేసుకోవడం మంచిది. 
 
స్నేహం కుదిరాక మీ మనసులో ఉన్నమాట మీ కాబోయే ప్రియురాలికి కాక మరెవరికైనా చెప్పే ప్రయత్నం చేయవద్దు. మీరు ప్రేమిస్తున్నారన్నమాట మరో వ్యక్తి ద్వారా తెలియడం వలన మీ మైండ్‌పై సందేహం కలుగవచ్చు. మీరు ఐ లవ్ యూ చెప్పే ముందే ఆమె ఐ హేట్ యూ అని చెప్పేసినా ఆశ్చర్యపోనక్కరలేదు.
 
మీ ప్రేయసిపట్ల మీ మనసులో నిగూఢమై ఉన్న ప్రేమ భావనలను కాగితంపై పెట్టండి. లవ్ లెటర్‌లో మీరు వ్యక్తపరిచే భావాలు సెల్‌లో చెప్పేవాటికన్నా చాలా బలంగా ఉంటాయి. కాగితంపై మీ ప్రేమ అక్షరాల వెనుక దాగి ఉన్న మీ ప్రేమ మనసు లోతును ఆమె పూర్తిగా అర్థం చేసుకునే వీలుంటుంది.
 
మీ మనసులో ఉన్న భావాలన్నిటినీ తెలుసుకున్న తర్వాత మీ ప్రేమకు సదరు అమ్మాయి బందీ అవుతుంది. మీకు కచ్చితంగా జవాబిస్తుంది. ఒకవేళ ఆ లేఖలను పట్టించుకోకుండా ఉన్నట్లయితే మీ ప్రేమపై ఆమెకు ఎక్కడో చిన్న సందేహం ఉన్నట్లే లెక్క. ఆ లెక్కను మీరు కనుగొని తీరాల్సిందే. అప్పుడే మీరు మీ ప్రేమలో విజయం సాధించగలుగుతారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నన్ను అక్కడ తాకగానే నా భర్త ఔటైపోతున్నారు... ఏం చేయాలి?