Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పెళ్లి చేసుకున్నారు ఓకే.. పార్ట్‌నర్స్ మధ్య ప్రేమ సంగతేంటి?

పెళ్లి చేసుకున్నారు ఓకే.. పార్ట్‌నర్స్ మధ్య ప్రేమ సంగతేంటి?
, సోమవారం, 17 నవంబరు 2014 (16:36 IST)
పెద్దలు కుదిర్చిన వివాహమో లేదా... ప్రేమ వివాహమో చేసుకోవడం పెద్ద విషయం కాదు. పెళ్లి ద్వారా ఏకమైన బంధాన్ని సజావుగా సాగించేందుకు తగిన మార్గాలను ఎంచుకోవాలి. లేదంటే పెళ్లైన కొత్తలో భాగస్వాముల్లో ఉండే ఆ ప్రేమ మెల్లమెల్లగా పిల్లలు పుట్టాక, బాధ్యతలు పెరిగాక కనుమరుగవుతుంది.
 
మళ్లీ యధాతథంగా గొడవలు, మనస్పర్ధలు పెరుగుతాయి. తద్వారా విడాకులు తప్పవు. అందుచేత నేటి ట్రెండ్ ప్రకారం భాగస్వాముల మధ్య వివాహ బంధం సజీవంగా ఉండాలంటే.. ఇద్దరూ సర్దుకుపోయే నైజాన్ని కలిగివుండాలి. పెళ్లయ్యాక కూడా భాగస్వాములు ఒకరిపై ఒకరు ప్రేమను కలిగివుండాలి. ఎన్ని పనులున్నా భాగస్వామి ఆరోగ్యం ఇతరత్రా విషయాలపై శ్రద్ధ చూపాలి. 
 
భాగస్వాముల మధ్య ప్రేమానుబంధం బలపడాలంటే ఏం చేయాలి?
 
కుటుంబం, పిల్లలు, బిల్లూ కాకుండా ఇంకేవైనా వాటి గురించి మాట్లాడుకోండి. ప్రణయ బంధం తొలినాళ్ళలోని మధుర క్షణాలను గుర్తు చేసుకుని వాటిని మళ్ళీ సృష్టించుకోవడానికి ప్రయత్నించండి.
 
ప్రేమను తరచుగా సైగలు, ముద్దులు, ముఖ్యంగా మాటల ద్వారా వ్యక్త పరచండి. “ఐ లవ్ యూ” చెప్పండి – చెప్పేటప్పుడు పరస్పరం కళ్ళలోకి చూసుకోండి.
 
బయటకు వెళ్ళినప్పుడు కూడా చాలా తరచుగా భాగస్వామితో టచ్‌లో ఉండడి. చేతులు పట్టుకోవడం, అప్పటికప్పుడు కౌగలించుకోవడం, మొహం, జుట్టు, భుజం ఏదో ఒకటి తాకడం లాంటివి చేయండి. 
 
పరస్పరం ఎంత ప్రేమించుకుంటారో, ఎంత గౌరవి౦చుకుంటారో మీ పిల్లలను చూసినా తెలుసుకోనివ్వండి. సిగ్గుపడకండి. భాగస్వామికి వారానికోరోజు సర్‌ప్రైజ్ ఇవ్వండి. ఒక చిన్న లవ్ నోట్ లేదా ఒక పువ్వు లేదా ఒక మంచి ప్రదేశానికి వారాంతపు విహారానికి వెళ్ళండి. 
 
సరదాగా కొన్ని పనులు చేయండి. వానలో నడవడం, పని ఎగ్గొట్టి సినిమాకు వెళ్ళడం వంటివి చేయండి. పెళ్లయ్యాక బాడీ షేష్, రూపంపై బద్ధకం చూపొద్దు. భాగస్వామి కోసం షేవ్ చేసుకోవడం, అత్యుత్తమ డ్రెస్ వేసుకోవడం చాలా తప్పనిసరి. అలాగే మహిళలు కూడా పెళ్లయిపోయింది కదా అని అందం నిర్లక్ష్యం చేయకూడదని మానసిక నిపుణులు అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu