Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇష్టం లేని పెళ్లయినా.. నీకు నేను.. నాకు నువ్వుగా..?

ఇష్టం లేని పెళ్లయినా.. నీకు నేను.. నాకు నువ్వుగా..?
, మంగళవారం, 25 నవంబరు 2014 (17:53 IST)
పెళ్ళిళ్లు స్వర్గం నిర్ణయించబడతాయని పెద్దలంటున్నారు. ప్రేమించిన వ్యక్తితో పెళ్లి కాకున్నా.. ఒత్తిడి, గౌరవ ప్రతిష్టల కోసం పెద్దలు కుదిర్చిన వివాహంతో పెళ్లి చేసుకున్నా.. కొన్ని చిట్కాలు పాటిస్తే సుఖసంతోషమైన జీవితం సొంతం చేసుకోగలరని మానసిక నిపుణులు అంటున్నారు.  
 
పెళ్లికి ముందు పెళ్లికి తర్వాత అమ్మాయిని భయం వేధిస్తుంది. మెట్టినింటి వాతావరణమే అమ్మాయిలను పెళ్లంటే భయపడేలా చేస్తుంది. కానీ అర్థం చేసుకుని ఎలాంటి సమస్యనైనా తెలివిగా పరిష్కరించుకోవాలనే ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. 
 
మీపై మీకు నమ్మకం ఉంచాలి. ఇతరుల కోసం కొన్నిసార్లు మిమ్మల్ని మీరు మార్చుకోవాలి. కాబట్టి అనవసర భయాలన్నీ తొలగించుకుని కొత్త వాతావరణానికి, మనుషులకు మానసికంగా సంసిద్ధులైతే తర్వాత అంతా హ్యాపీగా ఉండవచ్చు.
 
ఎంత ఇష్టం లేకుండా జరిగిన పెళ్లయినా భార్యాభర్తలిద్దరూ వ్యక్తిగత అలవాట్లు అభిప్రాయాలు, లక్ష్యాలు మొదలైన అంశాల గురించి ఒకరికొకరు ముందు తెలుసుకోవాలి. ఆ తర్వాత వాటికి అనుగుణంగా నడుచుకునే ప్రయత్నం చేయాలి. 
 
అలాగే మీ భార్యకు జీవితంలో ఏదైనా సాధించాలనే లక్ష్యం ఉందనుకోండి...ఆ లక్ష్యం దిశగా ఆమె విజయం సాధించే వరకూ మీరు ప్రోత్సహిస్తూనే ఉండాలి. ఇలా చేయడం వల్ల అయిష్టాలన్నీ ఇష్టాలుగా మారే అవకాశం ఉంటుంది.
 
చిన్న విషయాలకే గొడవపడకుండా సర్దుకుపోవాలి. పొరపాట్లను చేయకుండా సరిదిద్దుకోవడం. భాగస్వామి కోసం సర్దుకుపోవడం చేస్తే భార్యాభర్తల మధ్య ప్రేమ దృఢమౌతుంది. 
 
అలాగే ఎంత బిజీగా ఉన్నా.. కాసేపు ఒకరితో ఒకరు మనస్సు విప్పి మాట్లాడుకోవడం, కష్టసుఖాలు పంచుకోవడం లాంటివి చేయాలి. అలాగే వారాంతాల్లో సినిమాకి, షికారుకి, లంచ్‌కో లేదంటే డిన్నర్ కో వెళ్ళడం వంటివి చేయడం కూడా మంచిదేనని మానసిక నిపుణులు అంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu