Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పిల్లలు పుట్టకముందే సరే.. తల్లిదండ్రులయ్యాక..?

Advertiesment
Healthy Love tips for couples
, శుక్రవారం, 21 నవంబరు 2014 (18:05 IST)
ఈ రోజుల్లో కొందరు భార్యాభర్తలు పనుల వల్ల మరికొందరు విశ్రాంతి పేరుతో అదేపనిగా టీవీ, కంప్యూటరు ముందు గడుపుతుంటారు. ఆ నిద్రలేమి తాలుకు చికాకు ప్రభావం మర్నాటి దినచర్యపైనే కాదు, లైంగిక జీవితంపైనా పడుతుంటారు మానసిక నిపుణులు. 
 
ఈ పరిస్థితికి చెక్ చెప్పాలంటే ముందు ఇద్దరూ దినచర్యకు ఓ ప్రణాళిక రూపొందించుకోవాలి. దానిప్రకారం పనులు చేసుకోవాలి. సరైన నిద్రవేళల్ని పాటించాలి. పిల్లలు పుట్టకముందు వరకు ఎంతో ఆనందంగా, గడిపిన భార్యాభర్తలు తల్లిదండ్రులయ్యాక వాటినన్నింటి తగ్గించుకుంటారు.
 
బాధ్యతల పేరుతో సమయం అంతా పిల్లలకే కేటాయిస్తారు. ఇది మంచిదే కానీ మీకోసం కూడా కొంత సమయం కేటాయించుకోవడం తప్పనిసరి. ఎన్ని పనులున్నా కుదిరినప్పుడల్లా ఏకాంతంగా గడిపేలా చూసుకోవాలి.
 
చిన్నచిన్న వాటికే గొడవపడుతుంటారు. మనస్పర్థలు పెంచుకుంటారు. అది ఇద్దరి మధ్యా అనుబంధాన్ని దూరం చేయడమే కాదు. లైంగికజీవితంలోనూ సమస్యలు తెచ్చిపెడుతుంది. మీ సమస్య కూడా అదే అయితే ముందు మీ మధ్య మనస్పర్థలు తగ్గించుకునేలా చూసుకోండి. కలిసి మాట్లాడుకుని సమస్యకు అసలైన కారణాన్నితెలుసుకుని పరిష్కరించుకునే చూసుకోవాలని మానసిక నిపుణులు అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu