Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బుగ్గపై ముద్దు.. హగ్, హై ఫైవ్ వద్దు.. నమస్కారమే ముద్దు!

Advertiesment
Handshakes Out
, బుధవారం, 30 జులై 2014 (17:18 IST)
పాశ్చాత్య మోజు, సామాజిక వెబ్‌సైట్ల ప్రభావంతో ప్రస్తుతం నమస్కారం పెట్టడం మర్చిపోయాం. బుగ్గపై ముద్దు, హై ఫైవ్, షేక్ హ్యాండ్, హగ్ వంటి వాటికి అలవాటు పడిపోయాం. అయితే వీటి వల్ల బంధం బలపడే సంగతి పక్కనబెడితే.. అనారోగ్యాలు రావడం ఖాయమని అంటున్నారు బ్రిటిష్ పరిశోధకులు. 
 
బ్రిటన్‌లోని అబెరిస్ట్విత్ యూనివర్సిటీ చేసిన పరిశోధనలో కొత్త పలకరింపుల కారణంగా కోలై వంటి బాక్టీరియా వ్యాపిస్తోందని గుర్తించినట్టు పరిశోధకులు వెల్లడించారు. బుగ్గపై ముద్దు పెట్టుకోవడం, కౌగిలించుకోవడం ద్వారా ఒకరి శరీరం నుంచి మరొకరి శరీరంలోకి భారీ సంఖ్యలో బాక్టీరియా ప్రవేశిస్తుందని పరిశోధనలో తేలింది. 
 
హైఫైవ్, షేక్ హ్యాండ్, పిడికిలి (బంప్) గుద్దడం ద్వారా అరచేతుల్లోని బాక్టీరియా చేరుతుందని పరిశోధకులు తెలిపారు. వీటన్నింటికి బదులు ఫుల్ హ్యాండ్స్ షర్టు వేసుకుని మోచేతులు తాటించుకుంటే సరిపోతుందని పరిశోధకులు సూచిస్తున్నారు. అందుకే అన్నీ గమనించిన మన పూర్వీకులు నమస్కారం కనిపెట్టి సంస్కృతిలో భాగం చేశారు. నమస్కారం పెడితే ఎవరి బాక్టీరియా వారి వద్దే ఉంటుంది. ఇతరులకు పాకే ప్రసక్తే లేదు.

Share this Story:

Follow Webdunia telugu