Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శృంగారంలో గోల్డెన్ రూల్స్ మీకు తెలుసా?

Advertiesment
Golden rules
, బుధవారం, 3 సెప్టెంబరు 2014 (16:56 IST)
* శృంగారంలో పాల్గొనే ముందు గోల్డెన్ రూల్స్ ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో ఓసారి పరిశీలిద్ధాం. పగటి పూట రతిక్రియ చేయకూడదు. రాత్రి సమయాల్లో మాత్రమే రతిక్రియ జరపాలి. అది కూడా కేవలం ఒక్కసారి మాత్రమే. ఇందులో కూడా వీలైతే మధ్యమధ్యలో గ్యాప్ తీసుకుని భాపప్రాప్తి పొందాలంటున్నారు. 
 
* సూర్యోదయానికి ముందు నుంచి సూర్యోదయం తర్వాత చేసే రతిక్రియ వలన ఆరోగ్యం పాడవుతుంది. 
 
* కొందరు రాత్రి 7 గంటలకే భోజనాన్ని ముగుస్తారు. అలాంటి వారు రాత్రి పది గంటల తర్వాత సెక్స్‌కు ఉపక్రమించాలి. అదే రాత్రి 10-11 గంటల మధ్య భోజనం చేసే వారు అర్థరాత్రి తర్వాత రతిక్రియలో పాల్గొనాలి. భోజనం చేసిన తర్వాత శృంగారంలో పాల్గొనేందుకు కనీసం 2 నుంచి 3 గంటల వ్యవధి ఉండేలా చూసుకోవాలి. 
 
* నిద్రకుపక్రమించే ముందు పాలు సేవించకండి. పాలు తప్పనిసరిగా తీసుకోవాలనుకుంటే నిద్రపోయే ఓ గంటముందు పాలు సేవించండి. ఆరోగ్యానికి చాలా మంచిది. 
 
* స్త్రీలు రుతుక్రమంలో ఉన్నప్పుడు వారితో సంభోగించకండి. తొలి నాలుగు రోజుల్లో కనీసం కండోమ్ ఉపయోగించి కూడా రతిక్రియ జరపకూడదు. ఇలా చేస్తే అనేక సుఖ వ్యాధులకు సాదరంగా ఆహ్వానం పలికినట్టే. 
 
* కొందరు రతిక్రియ జరిపేటప్పుడు కేవలం వీర్యస్ఖలనం అయ్యేందుకు లేదా పిల్లల్ని పుట్టించేందుకు మాత్రమేనని అపోహ పడుతుంటారు. ఇలాంటి అపోహ మంచిది కాదు. రతిక్రియ జరిపేటప్పుడు ఎట్టిపరిస్థితుల్లోను తొందరపాటు ఉండకూడదు. తొందరపాటుంటే త్వరగా వీర్యస్ఖలనమై జీవిత భాగస్వామికి తీవ్ర అసంతృప్తి కలుగుతుంది. 
 
* రతిక్రియకు ముందు ఫోర్‌ప్లేకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. అప్పుడే భార్యాభర్తలు రతి క్రియలో స్వర్గసుఖాలను అనుభవిస్తారు. దీంతోపాటు జీవిత భాగస్వామిని కూడా మీరు తృప్తి పరచినవారవుతారు. 

Share this Story:

Follow Webdunia telugu