Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దీపావళి ఫెస్టివల్ : లవర్‌కు స్పెషల్ గిఫ్ట్‌గా ఏమిచ్చారు?

Advertiesment
Diwali Gifts Options For Your Loved Ones
, గురువారం, 16 అక్టోబరు 2014 (14:55 IST)
దీపావళి పండుగను పురస్కరించకుని మీ లవర్‌కు ఎప్పటిలా డ్రస్ తీసిద్దామనుకుంటున్నారా..? అయితే కాస్త ఆగండి. దివ్వెల పండుగ దీపావళి రోజున రొటీన్‌గా కొత్త దుస్తులతో సరిపెట్టకుండా స్పెషల్ కానుకలను ఎంచుకోండి.

అవి చాలా స్పెషల్‌గా మరిచిపోలేని విధంగా ఉండేలా చూసుకోండి. లవర్‌తో హ్యాపీగా గడపాలని నిర్ణయించుకున్నాక గిఫ్ట్ కూడా స్పెషల్‌గా ఇవ్వడం ఉత్తమమైన మార్గం. ఇక మీ భాగస్వామికి దీపావళి రోజున స్పెషల్‌గా ఎలాంటి బహుమతులు ఇవ్వాలో చూద్దాం.. 
 
దివ్వెల పండుగ అయిన దీపావళికి వెండి దీపాన్ని ప్రజెంట్ చేయొచ్చు. ఈ వెండి దీపంలోనే దీపపు వెలుగులు వెదజిమ్మాలని చెప్పండి. అలాగే కూర్చుని ఉండే మట్టి వినాయక బొమ్మలను కానుకగా ఇవ్వొచ్చు. ఎలుక రథ సారథిగా గణేషుడు రథంలో ఆసీనుడై ఉన్నట్లు గల బొమ్మలను ఎంపిక చేసుకోవచ్చు. 
 
వీటితో పాటు లెదర్ ఫోటో ఫ్రేమ్, వెండి నగల పెట్టెలు, రాజస్థాన్ గోమాత బొమ్మలు, కళాత్మక ప్లవర్ వాజ్‌లు, బుక్ రాక్‌లు, కలర్ ఫుల్ ఫోటో ప్రేమ్‌లు, వెండి రింగ్‌లు, డైమండ్‌తో కూడిన గణేష ప్రతిమలు గిఫ్ట్‌గా ఇవ్వొచ్చు. సో.. హ్యాపీ దీపావళి.

Share this Story:

Follow Webdunia telugu