Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భాగస్వామిని బెస్ట్ ఫ్రెండ్‌గా స్వీకరించండి.. హ్యాపీగా ఉండండి!

Advertiesment
10 ways to stay best friends forever with your husband
, మంగళవారం, 14 అక్టోబరు 2014 (16:35 IST)
చిన్న చిన్న విషయాలకే భార్యాభార్తలు గొడవపడుతున్నారా? అయితే ఈ టిప్స్ తప్పకుండా పాటించాల్సిందే. భాగస్వామిని బెస్ట్ ఫ్రెండ్‌గా భావించండి. చిన్న చిన్న విషయాలను పెద్దవి చేసి అనవసరంగా రాద్దాంతం చేయకండి. 
 
కాఫీ గ్లాసులు తాగి పెట్టేయడం.. టవల్స్‌ను బెడ్ మీద వేసేయడం, క్లీనింగ్‌ పట్ల భాగస్వామి నిర్లక్ష్యంగా ఉన్నా పట్టించుకోకుండా చిన్న చిన్న విషయాల్ని తేలిగ్గా తీసుకోండి.

అయితే శుభ్రత పట్ల భాగస్వామి ప్రాధాన్యత ఇచ్చేలా చూసుకోండి. పదే పదే చెప్పకుండా ఒకేసారి చెప్పండి. చెప్పిన పనిని చేసేలా చూడండి. కోపంగా కాకుండా సాఫ్ట్ కార్నర్‌తో పనులు లాక్కోండి. ఇలాచేస్తే భాగస్వామితో అనుబంధం మెరుగవుతుంది.  
 
చిన్న చిన్న విషయాలకే అనవసర రాద్దాంతం చేయకుండా.. భవిష్యత్తులో చేయాల్సిన విషయాలపై చర్చించండి. భాగస్వామికి పూర్తి సహకారం అందించండి. భాగస్వామిని మార్చేయాలని భావించకుండా.. అతనే మీ కోసం మారేలా చేసుకోండి. 
 
భాగస్వామిని బెస్ట్ ఫ్రెండ్‌గా స్వీకరించి కష్టనష్టాలను అతనితో షేర్ చేసుకోండి. బుద్ధికుశలతతో భాగస్వామిని మీ వైపు తిప్పుకోండి. ప్రతి విషయంలో చాతుర్యంగా వ్యవహరించండి. మీ సలహాలకు మీ భాగస్వామి ప్రాధాన్యత ఇచ్చేలా చూసుకోండి. వారికి ఇష్టమైన చిన్న చిన్న ఆశలను నెరవేర్చండి. ఇలా చేస్తే మీ వివాహ జీవితం ఎంతో ఆనందదాయకంగా ఉంటుందని మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu