నీ చూపు పేరు మారుని తూపు !
నీ ఓర చూపు నా మది నూపు!!
నీ నవు్వ మల్లె పువ్వుల తావి!
నీ మోము నిండు జాబిలి రూపు!!
నీ నీడ నాకు ``వెన్నెల మేడ''
నీ మాట తీరు వేదన బాపు!!
నీ వన్నె పైడి కొండను గేర
నీ మేను తీయ మామిడి తోపు!!
నీ రాక కోటి ఆశల తేరు!
నీ పైట గాలి కోర్కెను లేపు!!
నీ వేడి వేడి కౌగిలిలోన
నీ పొందు విందు స్వర్గము జూపు!!
నీ ``విశ్వసాక్షి'' కెల్లపుడిము్మ
నీ ప్రేమ సన్నిధానపు కాపు!!!