ప్రియా...
సాయం సంధ్యలలో
భానుడి పసిడి కాంతులలో
నీ అధరాల మృదు పలుకులను
ఆస్వాదించాలనే ఆశ... అడియాసే అయ్యింది
ఐతేనేం... పున్నమి వెలుగులలో
నా ప్రేమ మనసు నీకై ఆరాటపడింది...
నాడు వెన్నెల రాజు కాంతుల్లో...
దూరంగా నడిచి వస్తున్న నిన్ను చూసి
నా మనసు పండువెన్నెల్లో ఊయలలూగింది
వెన్నెల దేవతలా కదలి వచ్చి
నను పెనవేసుకున్న ఆ క్షణం...
నా అణువణువు ప్రేమ స్వర్గంలో ఓలలాడింది...
మళ్లీ ఆ వెన్నెలనాటి కమ్మదనాన్ని అందించవూ...
మళ్లీ నాటి సంధ్యా సమయపు క్షణాల్లో ఎదురుచూస్తూ...
నీ ప్రియుడు