స్వప్నమైనా ఆనందమే నువు కనిపిస్తానంటే...
చావైనా సంతోషమే నువు కరునిస్తానంటే...
గాయమైనా ఉత్సాహమే నువు దరికొస్తానంటే...
ఓటమైనా విజయమే నీ స్నేహం పంచిస్తానంటే...
చెప్పలేని బాధైనా సుఖమే నీ మదిలో చోటిస్తానంటే...
గుచ్చుకునే ముళ్లైనా పూలదారులే నను నీవు ఆహ్వానిస్తానంటే...
కానీ... అమృతమైనా విషమే నువు నన్ను కాదంటానంటే...
స్వర్గ సుఖమైనా నాకు నరకమే నను నువ్వు ప్రేమించనంటే...
అందుకే చెలీ నా ప్రేమ రాజ్యంలో పట్టపురాణివై నను కరుణించు...
ఇన్నాళ్లుగా నీకోసం వేచి ఉన్న నా మదిలో సంతోషాన్ని రగిలించు...