చీకటి వేళైనా ఉషోదయంలా కనిపిస్తావు
మండుటెండనైనా పండు వెన్నెలగా మార్చేస్తావు
కనుమూయగానే కలల అలవై వచ్చి సంతోషంలో ముంచేస్తావు
ఆరాటపడే మనసుపై అమృత చినుకుల్ని చిలకరిస్తావు
కనిపించకుండానే అనుక్షణం నను కవిస్తావు
అందుకే... నీమాయ సోకిన నా మనసు నను నిలవనీయనంటోంది
నినుచేరి తరించాలని అనుక్షణం నను వేధిస్తోంది