అతడు.. ప్రియా నిన్నే తలచా
నీకే తల వంచా
నీకై పుట్టాను, నీకోసం వచ్చా
నీ కోసం పడిగాపులు పడి చచ్చా...
ఆమె.. అయితే చావు.
అతడు.. నీవే నింగి, నేల,
నీవే నా సర్వసం...
ఆమె... ఏం నీకు ఇల్లు, వాకిలి లేదా...
నీకంటూ నీవారెవరూ లేరా...
అతడు... సర్వం నీవే ప్రియా,ఎటు చూసినా నీ వలపే
ఆమె... ఏం నీ ఒంట్లో ఎక్కువైందా పులుపు
అతడు... నిను వీడని నీడనౌతా...
ఆమె.. నరుకుతా బిడ్డా...
ఇలా అనగానే చల్లగా జారుకున్నాడు ఓ పోకిరి వెధవ. కాబట్టి అమ్మాయిలు ధైర్యంగా ముందుకురకండి. జీవితం మనది. జీవితాన్ని నాశనం చేసుకోకండి. అనవసరమైన భయాలకుపోయి, మీ ప్రాణాలపైకి తెచ్చుకోకండి. ధైర్యే సాహసే లక్ష్మీ అన్నారు. అలా ధైర్యం చేయండి, సాహసంగా జీవించండి. నిండైన జీవితం మీది. భవిష్యత్తు మీ చేతిలోవుంది. మీ కలలను సాకారం చేసుకోండి.