నేనంటే "అ"ఇష్టం
ఏ విషయంలో "అ"ఇష్టం
చెప్పవా...! మనసులోని మాటను
ఆడుకోవద్దు నా జీవితంతో
ఈ "చకోరపక్షి"పై ఎందుకింత అలక...నా వెన్నెలా
ఏమైందో ఏమోగాని...నా మీద అలక ఏలనో...నా వెన్నెలా
చాలాదూరంలోనే వున్నా...మనసు మాత్రం నీ వద్దే...నా వెన్నెలా
ఎటు చూసినా నీ ఆలోచనలే, నీ ఊసులే...నా వెన్నెలా
అమావాస్య నిశి రాతిరిలో ఉన్న నాకు నీ నిండు పున్నమి కావాలి...నా వెన్నెలా
మన్నించి, కరుణించి, దయ చూపవా...నా వెన్నెలా
అలక మాని కిలకిలా నవ్వవే...నా వెన్నెలా