Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నీ తలపుల సంద్రంలో మునిగిపోతున్నా...

Advertiesment
ప్రణయ రాగాలు పచ్చిక బయళ్లు గుండె గది తలుపు
, సోమవారం, 4 ఫిబ్రవరి 2008 (18:49 IST)
FileFILE
క్షణక్షణం నీ తలపుల తలంపులో
తీరమెరుగని నావలా మానస సంద్రంలో
దిక్సూచీని వెదుకుతూ...
ప్రేమ చుక్కానికై పరితపిస్తున్నా
పచ్చని పచ్చిక బయళ్లు
వెచ్చని ఊసుల లోగిళ్లు
నా గుండె గది తలుపును తడుతుంటే
నీ రాకకై నిరీక్షిస్తున్నా
ఆమనికై వేచి చూసే కోయిలలా....
నువ్వు వస్తావని...
నా హృదయవీణపై ప్రణయరాగాలను
పలికిస్తావని వేచి చూస్తున్నా
వస్తావు కదూ...

Share this Story:

Follow Webdunia telugu