కనులు మూసుకుని జీవిస్తున్నా...
కలలోనైనా కరునిస్తావని.
రాయలేని భావాలతో కవితలల్లుతున్నా...
అక్షరమై నా ముంగిట సాక్షాత్కరిస్తావని.
నిత్యం ఎదురు చూపులతో బ్రతికేస్తున్నా...
ఎనాటికై నా దరికి చేరుతావని.
మదిలోని కబురులన్నీమేఘాలతో చెబుతున్నా...
బీడువారిన మనసు పొలంలో చినుకువై వర్షిస్తావని.
నా చుట్టూ నిలిచిన అన్నింటా నిన్నే చూస్తున్నా...
నీవు తప్ప నాకు మరో లోకం లేదని తెలుసుకుంటావని.