Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కలల లోకంలో దాగిన చెలీ...

కలల లోకంలో దాగిన చెలీ...
, శుక్రవారం, 17 అక్టోబరు 2008 (16:51 IST)
ఊహల మాటున కొలువుంటావు
రెప్పలు మూసినవేళ కలవై కరుణిస్తావు
కనులు తెరిచినంతనే జ్ఞాపకంలా మిగిలిపోతావు

నీ తలపు స్వప్నం అంటే మది ఊరుకోదు
కాదు నువ్వు నిజం అంటే వాస్తవం ఒప్పుకోదు

వాస్తవం వెక్కిరిస్తున్నా... మనసు జోకొడుతున్నా
నీతలపే లోకంగా నీకోసం ఎప్పుడూ ఇలాగే ఎదురు చూస్తాంటాను.

Share this Story:

Follow Webdunia telugu