కమ్మని కలవై వచ్చి ముద్దుగా మురిపిస్తావు
రావా నావెంట అంటూ నాలో ఆశలెన్నో రేపుతావు
కలేనని తెలిసినా ఆనందంతో పరవశిస్తున్న ఆ క్షణాన
నిర్దయగా ఆ స్వప్నాన్ని చెరిపేసి పక్కుమని నవ్వేస్తావు
నీలోని ప్రాణమే నేనంటావు నీలోని ఆశసైతం నాకోసమేనంటావు
మాటలతో మాయచేసి గుండెల్లో కుంపట్లు రగిలిస్తావు
నీలోని సగం నేనంటావు నువ్వుంటూ మొత్తంగా నేనేనంటావు
నీ గుండె చెసే చప్పుడు నేనంటావు నీలోని శ్వాస సైతం నేనంటావు
అంతలోనే ఏమౌతుందో తెలియదుగానీ... నీకు నేనా అంటూ ఎగతాళి చేసేస్తావు
నాలోని ప్రాణమే నీవని తెలిసినా దాంతోనే నీవు ఆటలాడేస్తావు