Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కరుణించవా చెలీ... నన్ను ఓసారి...!

కరుణించవా చెలీ... నన్ను ఓసారి...!
FileFILE
ఎదురుగ వచ్చావని పొంగిపోయి కళ్లు తెరచినవేళ
కళ్లముందు నిలిచింది స్వప్నమని తెలిసి మనసు చిన్నబోయింది

చెవులను సోకిన అడుగుల సవ్వడి నిదేనని తలచి వెనుదిరిగి చూసినవేళ
రాలిన ఆకులు చేసిన సవ్వడని తెలిసి హృదయం కలుక్కుమంది

ఎవరి స్వరం విన్నా అది నీదేనేమోనని మదికి తోచినవేళ
కాదని తెలిసి ఊరుకోమని చెబుతుంటే మది సైతం మొరాయిస్తోంది

కరుగుతున్న మంచులా కాలం కరిగిపోతున్నా నీకూ నాకూ మధ్య దూరం మాత్రం ఎందుకో నిత్యం పెరుగుతూనే ఉంది
ఎన్నాళ్లీ ఎదురుచూపులంటూ మనసు నిత్యం రోదిస్తుంటే... దానికేం చెప్పాలో తెలియక హృదయం తల్లడిల్లుతోంది.

ప్రేమకు శక్తి ఉందో లేదో తెలియదుకానీ... నిన్ను చూశాకే నా మనసు పొరల్లో స్పందన నాకు వినిపించింది. కానీ ఎందుకో నేను ఎరగనుకానీ... నాలోని స్పందన నీకు మాత్రం వినిపించనంటోంది.

అయినాసరే నిను చూశాక నాలో చెలరేగిన ప్రేమనే ఈ అలల తాకిడి నిన్ను సైతం తాకే వరకు ఇలాగే మౌనంగా నీకోసం ఎదురు చూస్తూనే ఉంటాను. కరుణించినా... కాదంటూ నన్ను గెంటేసినా నీకోసం సాగిస్తున్న ఈ నిరీక్షణ మాత్రం ఆగిపోదు సుమా.

Share this Story:

Follow Webdunia telugu