Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కరుణించని చెలీ... నీకోసం ఓ లేఖ

కరుణించని చెలీ... నీకోసం ఓ లేఖ
FileWD
ఊహల్లో నీతో కలిసి వేసిన అడుగులు నా మదిలో ఇంకా శాశ్వతంగానే ఉన్నాయి. నా సమక్షంలో నిన్ను ఊహిస్తూ కన్న కలలన్నీ చెరగని జ్ఞాపకాల్లా ఇంకా నను వెంటాడుతూనే ఉన్నాయి. కానీ నీవు మాత్రం ఎందుకో మౌనం చెదరిని తపస్విలా ఇంకా అలాగే ఉన్నావు.

చెలీ అసలు నీకు తెలుసా...? నీకోసం ఎదురుచూస్తూ నేను కూర్చున్న అరుగుసైతం నావంక ప్రశ్నార్థకంగా చూస్తోంది. ఎప్పటికైనా నేను నీ ప్రేమను జయించగలనా అని దాని సందేహం కాబోలు...?. నీకోసం మౌనంగా ఆలపించిన గీతాలు, నిన్ను తలచి నేను రాసిన పిచ్చి రాతలు సైతం నన్ను చూసి జాలిపడుతున్నాయి. నేను రాసిన ఆ రాతలు నాగురించి నీలో కొంచమైనా జాలి కలిగించలేదేమని...?.

మల్లె పందిరిలోని పువ్వులు సైతం పక్కుమంటున్నాయి. ఏదీ నీ ప్రేయసి వచ్చిందా... ఆమె నడిచే దారిలో రాసులుగా పోస్తానంటూ గొప్పగా చెప్పావే అంటూ...?. చివరకు నీవల్ల నాలో చిగురించిన ప్రేమ సైతం నన్ను చూచి చాటుగా నవ్వుకుంటోంది. ఎన్నాళ్లైనా నా ప్రేమకథలో నెనొక్కడినే మిగిలిపోతానేమోనని దానికి సందేహం అనుకుంటా...?

కానీ ఎవరేమి అనుకున్నా... ఎవరెన్ని చెప్పుకున్నా... నా జీవితానికి భవిష్యత్ అంటూ ఉంటే అది నీతోనే... నా ప్రేమ పుస్తకంలో పేజీలంటూ ఉంటే వాటి నిండుగా నేరాసేది నీ పేరే... చెలీ నా ప్రేమకు నీవు చలించకున్నా... నాపై నీలో ఏనాటికీ ప్రేమ చిగురించకున్నా... చివరకు నా ఉనికిని సైతం నీవు గుర్తించకున్నా... నేను మాత్రం నీకోసం ఇలాగే... ఎప్పటికీ ఎదురు చూస్తూనే ఉంటా... కరుణించి నను చేరుకున్నా నీఇష్టం... ఆగ్రహించి నన్ను శపించినా నీఇష్టం... ఎందుకంటే నీకు ఇష్టమైనదేదైనా నాకు చాలా ఇష్టం.

Share this Story:

Follow Webdunia telugu