ఎన్నెన్నో జన్మల బంధం నీదీ నాదీ...
ప్రేమలోకంలో విహరించే జంట మధ్య చోటుచేసుకునే ప్రతి సంఘటన ఓ తీయని అనుభూతిని మిగులుస్తుంది. ఇద్దరూ ఊహాలోకంలో విహరిస్తూ ఎన్నో బాసలు చేసుకుంటారు. మృదుమధురంగా... తీపి జ్ఞాపకాలుగా మిగిలే ఆ తీయని అనుభూతులు ఎలా ఉంటాయో మన తెలుగు వెండితెర కూడా కాస్తంత ఒలికించింది. ప్రేయసీప్రియుల ఊహలకు దాశరథి రెక్కలు తొడిగితే... ఇద్దరి మదిలో మెదిలే భావాలకు ప్రాణం పోశారు ఎస్పీబీ.. వాణీజయరాం. మరచిపోలేని ఆ లవ్ సాంగ్‌ని ఓసారి చూద్దామా....ఎన్నెన్నో జన్మల బంధం నీదీ నాదీఎన్నటికీ మాయని మమత నాదీ నీదీ ఒక్క క్షణం నిను వీడి నేనుండలేనుఒక్క క్షణం నీ విరహం నే తాళలేను ఎన్నెన్నోపున్నమి వెన్నెలలోనా పొంగును కడలినిన్నే చూసిన వేల నిండును చెలిమినువ్వు కడలివైతే నే నదిగ మారి చిందులు వేసి వేసినిన్ను చేరనా. చేరనా.. చేరనా! ఎన్నెన్నోకోటి జన్మలకైనా కోరేదొకటేనాలో సగమై ఎపుడూ .. నీవుండాలినీ ఉన్నవేళా ఆ స్వర్గమేలాఈ పొందు ఎల్ల వేళలందు ఉండనీ. ఉండనీ.. ఉండనీ.. ఎన్నెన్నోచిత్రం : పూజగానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, వాణీ జయరాంరచన : దాశరథిసంగీతం : రాజన్-నాగేంద్ర