కొవ్వొత్తి కరిగిపోతుంది
క్షణం గడిచిపోతుంది
వెలుగు చీకటవుతుంది
పున్నమి అమావాస్య అవుతుంది
నీటి చినుకు ఆవిరవుతుంది
కారు మేఘం మాయమవుతుంది
ఇంధ్ర ధనుస్సు ఇంద్రజాలమవుతుంది
సముద్రపు కెరటం అంతర్థానమవుతుంది
చెట్టు ఆకులు రాల్చుతుంది
పిట్ట కూత ఆగిపోతుంది
చేనుగట్టు చిత్తడి ముద్దగా మారిపోతుంది
పంటచేను పండిపోయి పడిపోతుంది
కానీ
ఈ భూమి తిరుగుతుంది
కాలం గమనిస్తూనే ఉంటుంది
మనిద్దరి ప్రేమ నిత్యం కొత్త చిగురులేస్తూ ఉంటుంది
విశ్వంలో నక్షత్రాల్లా మన ప్రేమ తళుకులు
నిత్యం ప్రకాశిస్తూనే ఉంటాయి
నీ హృదయ సవ్వడులు
నిత్యం నా హృదయంతో పరవడి చేస్తూనే ఉంటాయి
ప్రాణాలు పోయినా... ఆత్మలుగా అహరహం
నువ్వూ నేనూ ఒకటే ప్రియా...