ప్రియా... నీ ప్రేమ కమ్మదనాలు... నీ స్పర్శ మధురానుభూతులు

శనివారం, 23 మార్చి 2013 (22:09 IST)
WD
ప్రియా -

నీ ప్రేమ కమ్మదనాలు

నీ స్పర్శ మధురానుభూతులు

నీ ముద్దు తీయదనాలు

నీ కౌగిలి వెచ్చదనాలు

నా గుండెల్లో కోటి రాగాలు మీటాయి

నా హృదయాంతరాళంలో సవ్వడి చేశాయి

నా మనసులో పాదరసంలా కలిసిపోయాయి

నా పాదాలు నీకోసమే అడుగులేస్తున్నాయి

ఎన్నాళ్లీ కౌగిలి ఎడబాటు విరహ వేదన

ఎన్నాళ్లు వేచి చూడాలి నీ అధరామృతం కోసం

ఎన్నాళ్లు గడపాలి నీ స్పర్శా సుఖానికి దూరంగా

రావా చెలీ

నీకోసం ఎదురుచూస్తూనే

ఎన్నాళ్లయినా....

వెబ్దునియా పై చదవండి