నువ్వు లేవు,,,
నీ పాట ఉంది..
నిన్న మనమధ్య కురిసిన భావానుబంధం
ఇవ్వాళ మాయమైందా....
లేదేమో...కాదేమో...
జీవితపు ఒత్తిళ్ల తాపుకు
మనం చెరొక దారి పట్టామేమో..
నిన్న కురిసిన హిమసమూహాలు
నేడు కరిగిన హిమానీనదాలు
ఘనీభవించిన హృదయఘాతాలు
ద్రవీభవించిన మృదు హృదయాలు
ఇంతేనా...
ఇది ఇంతేనా..
బతుకింతేనా...
ఇలాగే బతికేయాల్సిందేనా...
నువ్వూ నేనూ కలిసి నడిచిన ఆ మార్గం
నీవు నేనుగా నేను నువ్వుగా దర్శించిన ఆ దారి
ఇప్పుడిలా... నిరాకారంగా.. నిరామయంగా...
మూసుకుపోవలసిందేనా...
నా మధు హృదయమా...
ఇది నేను కనదలిచిన కల కాదేమో.
నువ్వు కనదలిచిన కల అంతకంటే కాదేమో..
నువ్వలా... నేనిలా... మనమిలా...
అంతం లేని ఎడారి...
అవసరమా...
మనకిది అవసరమా...
మళ్లీ ఒకరినొకరం...
ఆ పాత రోజుల సాక్షిగా
కవితలల్లుకోవడం సాధ్యమే..
అని నమ్మకం.. నా నమ్మకం..
మరి నీవూ.. నీ నమ్మకమూ...!