Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కలకాలం ఇదే సాగనీ...

Advertiesment
మధువు స్వరం ప్రేమ మది మనోభావాలు

WD

FileFILE
మధువొలికే నీ స్వరం
నిశ్చలమైంది, కోమలమైంది...
మదిలోతుల్లో దాచుకున్న
మనోభావాలను స్పృశియించే తరుణంలో...
మన ప్రేమ జ్యోతి ప్రకాశిస్తోంది దేదీప్యమానంగా

అయినప్పటికీ...
నిరాధారమైన జలపాతంతో పోటీ పడుతూ...
కిందకు జారిపోతున్నావు
మనోభావాల మార్గంలో కలిసిపోతూ...
అంతే లేని అగాధాన్ని తలపిస్తున్నావు...

కానీ ప్రియతమా
తొందరపడి అనకు
ఆకాశమంతా నీదేనని...

మన ప్రేమకు పెన్నిధివి నీవే
కోమలమైన నీ ప్రేమ భావనలతో
మన ప్రేమ కలకాలం కాంతులు వెదజల్లుతూ ఉంటుంది.

అంతటితో ఆగక...
నా ఈ మాటల వర్షాన్ని ప్రేమ జీవులపై కురిపిస్తుంది.
స్ఫూర్తినందించే వరంలా

Share this Story:

Follow Webdunia telugu