ఓ యువకుడు డాక్టర్ దగ్గరకు వెళ్లి చెకప్ చేయించుకుని ప్రిస్కిప్షన్ రాయించుకున్నాడు...
"డాక్టర్ గారూ... ఈ మందులు వాడతాను. ఇంకేమైనా జాగ్రత్తలు తీసుకోవాలా..?" అడిగాడు
"ముఖ్యంగా అమ్మాయిలను వెంబడించటం మానుకోకుంటే చస్తావు.." చెప్పాడు డాక్టర్
"అమ్మాయిల వెంట పడితే చచ్చిపోతారా...ఎవరైనా..?" ఆశ్చర్యంగా అడిగాడు ఆ యువకుడు
"మరి నువ్వు వెంబడిస్తున్న వాళ్లలో మా అమ్మాయి కూడా ఉందిరా రాస్కెల్..!" కోపంతో ఉరిమి చూశాడు డాక్టర్.