పార్కులో కూర్చున్న ఓ ప్రేమ జంట? ఇలా మాట్లాడుకుంటున్నారు.
మనం ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకుందాం రవి అంది గిరిజ.
అలా ఎందుకు అంటూ అర్థంకాక అడిగాడు రవి.
మనకు పెళ్లైన విషయం తెలిస్తే నా ఉద్యోగం ఊడిపోతుంది అంటూ చెప్పింది గిరిజ.
సరే మనం ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకుందాంలే అన్నాడు రవి.
మరి మనకు పిల్లలు పుడితే ఎలా అంటూ ప్రశ్నించింది గిరిజ.
ఇందులో అంతగా ఆలోచించడానికి ఏముంది వాళ్లకీ మన పెళ్లి విషయం చెప్పకుండా దాచేద్దాం అన్నాడు రవి.