"రాహుల్.. నువ్వు నా పెళ్లికి తప్పకుండా రావాలి, ఇదిగో వెడ్డింగ్ కార్డ్.. తప్పకుండా వస్తావు కదూ...?!" అడిగాడు సిద్ధార్థ
"అదేంట్రా అలా అడుగుతున్నావు.. నువ్వు నాకు చాలా మంచి స్నేహితుడివి... నువ్వు కష్టకాలంలో ఉంటే రాకుండా ఎలా ఉంటాను చెప్పు... తప్పకుండా వస్తాన్లేరా...!!" బదులిచ్చాడు రాహుల్.