ఓ చెట్టు మీద చాలా రోజులుగా ఓ చిలుక, ఓ గోరింక కలిసి జీవిస్తున్నాయి. పచ్చని చిలుక అందాన్ని చూసి గోరింక దానిపై మనసు పడింది. దాంతో తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా చిలుకను గోరింక కోరింది.
కానీ గోరింక కోరికను చిలక మన్నించనంది. దాంతో ఎందుకు నన్ను పెళ్లి చేసుకోవు అంటూ చిలకను గోరింక అడిగింది. దానికి చిలక ఏం సమాధానం చెప్పిందో తెలుసా... మా ఇంట్లో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్‌కి అస్సలు ఓప్పుకోరంది.