రెండేళ్లుగా ప్రేమలో మునిగి తేలుతున్న ప్రసాద్, తన గర్ల్‌ఫ్రెండ్‌తో...
"నాకు ఎలాంటి ఉద్యోగమూ లేకపోయినా సరే.. నీ ప్రేమ కోసమే నేను బ్రతుకుతాను డియర్.. ప్లీజ్ మనం పెళ్లి చేసుకుందాం..!" అని అడిగాడు.
"ప్రేమ కోసమే బ్రతుకుతావా...? మరి మనం పెళ్లి చేసుకుంటే, తినడానికి ఎలా...?" సందేహంగా అడిగింది ధాత్రి
"నేను మళ్లీ మళ్లీ చెబుతున్నాను డార్లింగ్..! మనం కేవలం ప్రేమ కోసమే బ్రతుకుదాం...!!"
ఎలాగోలా ధాత్రిని కన్విన్స్ చేసిన ప్రసాద్ పెళ్లి చేసుకున్నాడు. హనీమూన్ రెండో రోజున నిద్ర లేచిన ధాత్రి ఏకంగా హీటర్ కిందకు వెళ్లి కూర్చుంది.
"ఏం చేస్తున్నావ్ ధాత్రీ...!"
"ఆ... నీకోసం బ్రేక్‌ఫాస్ట్‌ను హీట్ చేస్తున్నాన్లే...!!"