ప్రతిరోజూ భార్య ఉమ తన కాళ్లద్దుకుని దండం పెడుతుంటే దీని మతలబు ఏంటా అని అనుమానం పట్టుకుంది రమేష్‌కి. అడిగితే ఒక తంటా. అడక్కపోతే ఒక తంటా.. అలా అని మనసు ఊరుకోవట్లేదు. ఇదికాదనుకుంటూ ఒక రోజు అడిగేశాడు నేరుగా..
రమేష్: అయినా ఉమా... నాకు తెలీకడుగుతా కాని ఏం తప్పు చేశావని రోజూ నా కాళ్లకు దణ్ణం పెడుతున్నావు?
ఉమ: మిమ్మల్ని పెళ్లి చేసుకున్నా కదండీ...
డమేల్ మని శబ్దం వస్తే తిరగి చూసింది.
ఏంలేదు రమేష్ ఫ్లాటయ్యాడంతే..