ఈరోజు పెళ్లి విషయం అటో ఇటో తేలిపోవాలని వార్నింగ్ ఇచ్చింది రాధ
సుమతి కూడా అదే విధంగా వార్నింగ్ ఇవ్వడంతో అయోమయంలో పడిపోయాడు కృష్ణ
ఎట్టకేలకు సుమతి దగ్గరకు వెళ్ళి కృష్ణ "సారీ సుమతీ... మా తాత చనిపోయాడు. ఇంకో ఏడాదిదాకా నేను పెళ్లి చేసుకోకూడదు" అని అన్నాడు
వెంటనే సుమతి... "థాంక్ గాడ్... నీకు వార్నింగే ఇచ్చానేగానీ... ఎక్కడ నిన్ను పెళ్లి చేసుకోవాల్సి వస్తుందోనని తెగ భయపడి చచ్చాననుకో... కృష్ణా...!"