రోజంతా కలిసి ఉండి తర్వాతెప్పుడో ఇంటికిపోయే శారద ఈ మధ్య తన వద్దకు రాకపోయేసరికి బెంగ పట్టుకుంది రాధకు. అనుకోకుండా ఓ రోజు రాధ తనను కలిసేసరికి తెగ సంతోషపడిపోయింది. ఆ సందర్భంగా ఏం మాట్లాడాలో స్పురించలేదామెకు. అయినా ఏదో ఒకటి మాట్లాడాలి కదా..
శారద: ఎమ్మా రాధా.. ఏమైంది ఒంట్లో బాలేదా?
రాధ: నాక్కాదాంటీ. మా ఆయనకు కొద్ది రోజులుగా ఒంట్లో బాలేదు.. చాలా బెంగగా ఉంది అంటూ బోరుమంది..
శారద: ఊరుకోమ్మా.. ఏం బాధపడకు. పాపీ చిరాయువు గదా... బతుకుతాడులే...
తెల్లముఖం వేయడం రాధవంతయిందిప్పుడు....