"రోజాపూలు ఎరుపు, చామంతిపూలు పసుపు, చక్కెర తీపి... ఆ పువ్వుల అందంకంటే, చక్కెర తీపికంటే నువ్వే బాగుంటావు ఝాన్సీ...!" తమకంగా అన్నాడు పెళ్లికాని ప్రసాద్
"రోజాపూలు వాడిపోతాయి, చామంతిపూలు చచ్చిపోతాయి, చక్కెర పాత్ర ఖాళీ అవుతుంది.. కాబట్టి ఆ పాత్రను నీ నెత్తిమీద బోర్లిస్తే ఇంకా బాగుంటుంది ప్రసాదూ..!!" బదులిచ్చింది ఝూన్సీరాణి.