ప్రేమలో పడ్డ యువకుడు తన ప్రేయసికి ఇలా లెటర్ రాశాడు.
ప్రియా నాకు నువ్వంటే చాలా ఇష్టం. అయితే నేను రాజేష్‌లా నిన్ను కారులో తిప్పలేక పోవచ్చు. వాడిలా నీకోసం వేలకు వేలు ఖర్చు పెట్టలేకపోవచ్చు. కానీ నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఎంత ఇష్టమంటే నాకంటే కూడా నీవే నాకు చాలా ఇష్టం.
ఆ లెటర్ చదివిన ఆ అమ్మాయి ఇలా సమాధానం రాసింది.
నాకూ నువ్వంటే చాలా ఇష్టం. అయితే ఆ రాజేష్ అడ్రస్ కాస్త చెప్పవా... ప్లీజ్...