"బాబూ సురేష్... నీకు పెళ్లి సంబంధాలు చూద్దామనుకుంటున్నాము. ఎలాంటి అమ్మాయిని చూడమంటావ్..?" అడిగాడు తండ్రి
"మీ ఇష్టం నాన్నా...!" చెప్పాడు సురేష్
"అది కాదురా.. నీకు కూడా కొన్ని అభిప్రాయాలుంటాయి కదా..."
"అయితే అచ్చం చందమామలా ఉండే అమ్మాయిని చూడండి"
"మాంచి అందగత్తెను తెమ్మంటావు.. అంతేనా..?!"
"నా ఉద్దేశ్యం అది కాదు నాన్నా.. చందమామలా రాత్రివేళల్లో వచ్చి, తెల్లారగానే మాయమైపోతే చాలు...!!"