పేపరు చదువుతున్న సుబ్బారావు వీపు మీద ఒక్కటిచ్చుకుంది సుందరి. బిత్తరపోయిన సుబ్బారావు ఏమిటని అడిగాడు. "నీ చొక్కా జేబులోని కాగితం మీద మేరీ అనే అమ్మాయి పేరు రాసి ఉంది ఏంటి సంగతి" అని అడిగింది సుందరి.
సుబ్బారావు : సుందరీ నువ్వు నన్ను అపార్థం చేసుకున్నావు పోయిన ఆదివారం నేను ట్రెక్కింగ్‌ను వెళ్లాను గుర్తుంది కదా... అక్కడ మేరీ అనే గుర్రం మీద నేను తిరిగాను. అదీ సంగతి
మర్నాడు కూడా మాంచి కోపం మీదున్న సుందరి సుబ్బారావు వీపు మీద ఒక్కటిచ్చుకుంది. బిత్తరపోయి వెనక్కి తిరిగి చూసాడు సుబ్బారావు
సుబ్బారావు : ఈసారి ఏమైంది?
సుందరి : నువ్వెక్కిన మేరీ అనే గుర్రం ఇందాక ఫోన్ చేసి నీతో మాట్లాడాలని అడిగింది.
*********************************************************
తల్లి-కూతురు ఒక ముద్దు
ఒక బెంగాలీ తల్లి ఈడొచ్చిన తన కూతురును గదమాయిస్తూ ఇలా అడిగింది
బెంగాలీ తల్లి : ఆ రమేష్ నిన్ను ముద్దు పెట్టుకుంటుంటే ఆపలేదేఁ
కూతురు (అమాయకంగా) : నన్నేం చెయ్యమంటావ్ ముద్దు పెట్టుకోవద్దని చెబుదామంటే నాకు తెలుగు మాట్లాడటం రాదాయేఁ... అప్పుడిక అతన్ని ఎలా ఆపేది?!