ఇచ్చట అన్ని జిల్లాల కోళ్లు అమ్మబడును అని రాసి ఉన్న ఓ దుకాణం దగ్గరకు వెళ్లాడు రాజా.
అక్కడున్న అమ్మాయితో నాకు కృష్ణా జిల్లా కోడి కావాలి అని అడిగాడు రాజా.
వెంటనే ఆ అమ్మాయి గంప కింద ఉన్న కోళ్లను ఒక్కొక్కటిగా తీసి వాటిని గాఢంగా వాసన చూచి మళ్లీ మరో గంప కింద పెట్టేయసాగింది. అలా నాలుగైదు కోళ్లను వాసన చూచిన తర్వాత ఓ కోడిని వాసన చూచి ఇదే కృష్ణా జిల్లా కోడి అంటూ రాజా చేతికిచ్చింది.
అమె కోళ్లను వాసన చూసే తీరును ఆశ్చర్యంగా చూసిన రాజా డబ్బులిచ్చేసి వెనక్కు తిరగబోయాడు. అంతలో అంగట్లో ఉన్న అమ్మాయి ఇంతకీ మీది ఏ జిల్లా అని రాజాను ప్రశ్నించింది.
నాది ఏ జిల్లానో నువ్వే కాస్త వాసన చూచి చెప్పరాదు అంటూ కొంటెగా ఆమె వంక చూశాడు రాజా.