"ఒరేయ్ సిద్ధూ... నీకు కాబోయే భార్య ఎలా ఉండాలనుకుంటున్నావు...?" అడిగాడు దినేష్
"మరేం లేదురా... ఇంటిపనులు చక్కగా చేయాలి, వంట బాగా వండాలి. చలాకీగా కబుర్లు చెబుతుండాలి, కష్టాల్లో వెన్నంటే ఉండాలి. శృంగారంలో రంభను మరిపించాలి. అన్నింటికంటే ముఖ్యమైంది ఏంటంటే... ఈ అమ్మాయిలెవరూ, ఒకరికొకరు తారసపడకుండా జాగ్రత్తపడాలి...!" నవ్వుతూ చెప్పాడు సిద్ధూ.