ఆఫీసు నుంచి ఇంటికొస్తున్న భర్తకు... తాను కొత్తగా కొన్న కుక్కర్ ఇంటిపక్కనే చెత్తకుండీలో కనిపించింది
ఆవేశంగా ఇంట్లోకి వెళ్లిన అతను "ఏంటే.. నీకేమైనా మతిపోయిందా.. నిక్షేపం లాంటి కొత్త కుక్కర్ని చెత్తకుండీలో పారవేస్తావా..?" అంచూ విరుచుకుపడ్డాడు
"ఏం చేయమంటారు చెప్పండి... అది ప్రతిరోజూ నన్ను చూసి ఊరికే తెగ ఈల వేసేస్తుంటే... పారేశా..!" చిరాగ్గా బదులిచ్చింది భార్య.