"ఓ ఖరీదైన బ్రాస్‌లెట్ చూపిస్తారా...?" అడిగాడు వాసు
"మీ లవర్ కోసమేనా...?" అడిగాడు షాపతను
"అవును"
"బ్రాస్‌లెట్ మీద ఆమె పేరు రాయమంటారా...?"
"వద్దు.. నాకెంతో ప్రత్యేకమైన నీకు అని మాత్రమే రాయండి"
"ఆహా.. మీకు ఆ అమ్మాయంటే, అంత ఇష్టమా..?"
"అబ్బే.. అదేం కాదు. ఆమె పేరు రాస్తే, ఒకవేళ రేప్పొద్దున్నే ఇంకో అమ్మాయికి బహుమతిగా ఇవ్వాల్సి వస్తే.. ఇబ్బందయిపోతుంది కదా.. అందుకనే...!!"