ఓ పార్కులో కూర్చున్న ప్రేమజంట ఇలా మాట్లాడుకుంటున్నారు
రాధా నువ్వు నన్ను మాత్రమే ప్రేమిస్తున్నావు కదా... అంటూ గోముగా అడిగాడు సుందరం.
అవును నేను నిన్ను మాత్రమే ప్రేమిస్తున్నాను అంటూ సమాధానమిచ్చింది రాధ.
నాలో నీకు ఏం నచ్చి ప్రేమించావ్... అంటూ మళ్లీ అడిగాడు సుందరం.
ఇప్పటివరకూ నన్ను చూసిన మగాళ్లలో నువ్వు మాత్రమే నా వెంటపడ్డావు. అందుకే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటూ అసలు విషయం చెప్పింది రాధ.