నేను మా ఆయనను ఎంతిదిగా ప్రేమిస్తానో ప్రతిరోజూ ఆయనకు పిలిచి మరీ చెబుతుంటానే..
స్నేహితురాలితో చెప్పింది వనజ.
అలాగా.. మరి మీ ఆయనంటే అస్సలు ఇష్టం లేదని ఆమధ్య ఒకసారి నాతోనే అన్నావే...
అనుమానంగా చూస్తూ అడిగింది స్నేహితురాలు.
నిజమేననుకో.. ఇష్టం లేదు... కాకపోతే అలా చెప్పడం వల్ల ఆయనకిచ్చిన పనులన్నీ చకచకా చేసేస్తుంటారు.
చావు కబురు చల్లగా చెప్పింది వనజ.