"నువ్వెప్పుడైనా, ఎవరినైనా, ప్రేమించి మోసపోయావా...?" అడిగాడు సుబ్బారావు
"ఒకసారి కాదురా, చాలాసార్లే మోసపోయాను" దిగాలుగా చెప్పాడు అప్పారావు
"అబ్బా... ఎంతమంది చేత మోసపోయావేంటి..?"
"మరి... ఒకసారి ఓ అమ్మాయిని ప్రేమిస్తే, ఆ అమ్మాయి ఇంకొడిని పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. మరోసారి ఓ అమ్మాయి నన్ను ప్రేమించి ఇంకొకరితో వెళ్లిపోయింది. మూడోసారి నేను ప్రేమించిన అమ్మాయే నన్ను పెళ్లి చేసుకుంది...!!"