ఓ ప్రేమికుల జంట పార్కులో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. అప్పుడు ఓ గాడిద వారున్న చోటుకు వచ్చి ఆ అమ్మాయిని చూచి గట్టిగా ఓండ్ర పెట్టడం ప్రారంభించింది. ఎంత తరిమినా అది అక్కడినుంచి పోలేదు. అప్పుడు ఆ అమ్మాయి తన ప్రియుడి వద్ద ఇలా అడిగింది.
రవి ఆ గాడిద ఇక్కడున్న అందర్నీ వదిలేసి నన్ను చూచే ఎందుకు అరోస్తోంది అంటూ అడిగింది.
నువ్వు రాసిన ప్రేమలేఖల్ని చదివి ఇక్కడే పారేసేవాడిని. ఆ కాగితాలన్నీ ఈ గాడిదే తినేది. అందుకే అది నీ మీద ప్రేమ ఎక్కువై నిన్ను చూచి అరుస్తోంది కాబోలు అంటూ బుర్రగోక్కున్నాడు రవి.