ఇద్దరు ప్రేమికులు పార్కులో కూర్చుని ఇలా మాట్లాడుకుంటున్నారు.
రాజు నువ్వు నన్ను జీవితాంతం ఇలాగే ప్రేమిస్తూ ఉంటావా... అంటూ గోముగా తన ప్రియుడ్ని అడిగింది రాధ.
తప్పకుండా రాధా నిన్ను నేను జీవితాంతం ఇలాగే ప్రేమిస్తూ ఉంటాను ప్రామిస్ అంటూ రాధ చేతిలో చేయి వేశాడు రాజు.
అయితే మనం ఎప్పుడు పెళ్లి చేసుకుంటాం అంటూ సంతోషంగా అడిగింది రాధ.
అదిగో ఆమాటే వద్దనేదీ జీవితాంతం ప్రేమిస్తానని మాటిచ్చానుగానీ పెళ్లి చేసుకుంటానని నీతో చెప్పానా అంటూ గడుసుగా ప్రశ్నించాడు రాజు.