ఓ ప్రేమ జంట పార్కులో కూర్చుని ఇలా మాట్లాడుకుంటున్నారు.
ప్రియా నేనంటే నీకు ఎంత ప్రేమ నేను అడిగానని నా కోసం ఈ నెక్లస్ తెచ్చావా అయితే నాకోసం రేపు కారు కూడా తెస్తావా అంటూ మురిపెంగా అడిగింది ప్రియురాలు.
నా వల్ల కాదు అంటూ గాభరాగా చెప్పాడు ప్రియుడు.
ఏం... ఎందుకని అంటూ అర్థం కాక ప్రశ్నించింది ప్రియురాలు.
నెక్లెస్‌కైతే డూప్లికేట్ దొరుకుతుంది... మరి కారుకు డూప్లికేట్ దొరకదుగా అంటూ తొందర్లో నిజం చెప్పేశాడా ప్రియుడు.