పరీక్షల్లో ఫెయిల్ అయిన తన కొడుకుని ఓ తండ్రి ఇలా తిడుతున్నాడు.
ఎప్పుడూ పరీక్షల్లో తప్పుతూనే ఉంటావ్... మన ఎదురింటి రాధ చూడు ఎప్పుడూ ఫస్ట్ క్లాస్‌లో పాస్ అవుతుంటుంది. ఆ అమ్మాయిని చూసైనా బుద్ధి తెచ్చుకోరా వెధవా అంటూ కొడుకుపై ఎగిరి పడ్డాడు తండ్రి.
మన ఎదిరింటి రాధను చూడడం ప్రారంభించాకే నేను పరీక్షల్లో ఫెయిల్ అవడం ప్రారంభమైంది అంటూ అసలు విషయం చల్లగా చెప్పాడా కొడుకు.