పార్కులో కూర్చున్న ప్రేమ జంట ఇలా మాట్లాకుంటున్నారు.
నువ్వు నన్ను మోసం చేశావు అంటూ ప్రేయసితో కోపంగా అన్నాడు ప్రియుడు.
నేను నిన్ను మోసం చేయడం ఏంటి డియర్ అంటూ గోముగా అడిగింది ప్రేయసి.
నన్ను జీవితాంతం ప్రేమిస్తే చాలు అన్నావు... మరి ఇప్పుడేమో పెళ్లి చేసుకోమంటున్నావు. ఇది మోసం కాదా అంటూ ప్రేయసిని ప్రశ్నించాడు ప్రియుడు.