ఓ ఇద్దరు స్నేహితులు ఇలా మాట్లాడుకుంటున్నారు.
రామూ నీకు కాబోయే భార్య ఎలా ఉండాలి అంటూ అడిగాడు రమేష్.
నాకు కాబోయే భార్య అందంగా, తెలివి తేటల్తో, మర్యాద కల్గి ఉండాలి అంటూ చెప్పాడు రాము.
అసలే ధరలు మండి పోతున్న ఈ రోజుల్లో ముగ్గురు భార్యలతో ఎలా నెట్టుకొస్తావురా అంటూ అడిగాడు రమేష్.